పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. కానీ : వర్మ | In speeches Power was Mega original twitts ramgopal verma | Sakshi
Sakshi News home page

పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. కానీ : వర్మ

Published Mon, Mar 21 2016 7:06 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. కానీ : వర్మ - Sakshi

పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. కానీ : వర్మ

ఎప్పుడూ తన సినిమాలతో పాటు వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తన మార్కు సెటైర్లు వేశాడు. ఆదివారం రాత్రి జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా వర్మ వదలలేదు.

ఆడియో ఫంక్షన్ లో పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్గా ఉంటే మెగా స్టార్ చిరంజీవి ప్రసంగం పవర్ఫుల్గా ఉన్నా సహజత్వం లేదని వర్మ వ్యాఖ్యానించారు. అయినా మెగా, పవర్ ఫుల్గా అన్నదమ్ముల అనుబంధం మాత్రం వర్కవుట్ అయిందని ట్విట్ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ విషయంలో మాత్రం అర్థమై కానట్లు తనదైన శైలిలో ట్విట్ చేశాడు. చివర్లో జై పవన్ అంటూ ముగించాడు.  

సర్దార్ గబ్బర్ సింగ్  సినిమాను హిందీలో విడుదల చేయడం సూపర్ డూపర్ తప్పు అవుతుందని ఇంతకు ముందు ట్విట్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి స్థాయిలో విజువల్స్ స్థాయి ఉంటే తప్ప ఆ సినిమాను హిందీలో విడుదల చేయొద్దని కూడా అప్పుడు సలహా ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement