
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి నాంపల్లిలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. మహి ళలను కించపరిచేలా రూపొందించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ చిత్రం విడుదల కాకుండా చూడాలని ఫిర్యాదులో కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాంగోపాల్‌వర్మ బూతు సినిమాలు సమాజాన్ని చెడగొడుతున్నట్లు మండిపడ్డారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలతో పోర్న్ చిత్రాలు తీస్తానన్న వర్మ వ్యాఖ్యలను ఖండించారు. జీఎస్టీ సినిమాను తీసి మహిళలను ఆటబొమ్మలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చిత్రాలను వీక్షించి యువత పాడైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేవి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐటీ యాక్టు 67, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాంగోపాల్‌వర్మపై పలు మహిళా సంఘాల నాయకులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డికి ఫిర్యాదు చేశారు. వర్మ చిత్రీకరించిన జీఎస్టీ చిత్రంలో అసభ్యకర దృశ్యాలున్నాయని పేర్కొన్నారు.ంగోపాల్‌వర్మపై కేసు