తేడా సైకో | Psycho Varma shooting completed | Sakshi
Sakshi News home page

తేడా సైకో

Published Mon, Sep 28 2020 1:37 AM | Last Updated on Mon, Sep 28 2020 1:37 AM

Psycho Varma shooting completed - Sakshi

నట్టి క్రాంతి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నట్టి క్రాంతి హీరోగా, కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత నట్టికుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి లక్ష్మి సమర్పణలో అనురాగ్‌ కంచర్ల, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా నట్టి కుమార్‌ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన ‘డీఎస్‌జె (దెయ్యంతో సహజీవనం)’ సినిమా లొకేషన్లో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నట్టికుమార్‌ మాట్లాడుతూ– ‘‘సైకో వర్మ’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. మా అబ్బాయి నట్టి క్రాంతి నేను అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నాడు’’ అన్నారు. ఈ  చిత్రానికి సంగీతం: ఎస్‌.ఏ.ఖుద్దూస్, కెమెరా: జనార్ధననాయుడు, జనా, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: కె.ప్రేమ సాగర్, ఎస్‌. రమణా రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement