'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా' | Am embarrassed as Andhra citizen with CB Naidu | Sakshi
Sakshi News home page

'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా'

Published Tue, Jun 16 2015 12:46 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా' - Sakshi

'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా'

ముంబయి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పనికి తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టను మసకబార్చారని ట్విట్టర్లో ఆరోపించారు. కేసీఆర్ ముక్కు సూటి తననానికి తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నాని అన్నారు.

రేవంత్ రెడ్డి చాలా క్రియాశీలకంగా ఉండేవాడని, దూకుడుగా పనిచేసేవాడని అనవసరంగా ఓటుకు నోటు వ్యవహారం ఇరుక్కున్నారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడు. ఇందులో చంద్రబాబునాయుడు కూడా ఇరుక్కోకుండా ఉండాలని కోరుకుంటున్నాని వ్యంగ్యంగా అన్నారు. తాను ప్రత్యేకంగా ఒక ప్రాంతం ఉద్దేశించి చెప్పేవాడిని కాదని, అయితే, తన ప్రాంతంతో పోలిస్తే చంద్రబాబు కంటే కేసీఆర్ ముందున్నారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement