వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్... | ramgopal verma posted osama, hitler on his twitter | Sakshi
Sakshi News home page

వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్...

Published Tue, Jun 16 2015 9:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్...

వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్...

ముంబయి: ఎప్పుడు చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ వివాదాల్లో చిక్కుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏం తోచలేదేమో.. నిన్న ఓ నియంత, నేడు ఓ ఉగ్రవాది ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానులను అవాక్కయ్యేలా చేశారు. మంగళవారం ఉదయాన్నే లాడెన్ చిన్ననాటి ఫొటోలు.. అతడి పిల్లల ఫొటోలు పెట్టి చర్చల్లో నిలిచాడు.

వర్మ తన ట్విట్టర్లో ముందుగా హిట్లర్ చిన్న నాటి ఫొటో పెట్టి.. 'ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యి 60 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాడని మనం ఊహించగలమా.. అతడి పేరు అడాల్ఫ్ హిట్లర్ అని వ్యాఖ్య చేశాడు. ఇక లాడెన్ బాలుడిగా ఉన్నప్పటి ఫొటో, యుక్త వయసులో ఉన్న ఫొటో, అతడి పిల్లల ఫొటోలు పెట్టాడు.

బాలుడిగా ఉన్నప్పటి ఫొటోపై 'ఈ బాలుడి పేరు ఒసామా బిన్ లాడెన్.. అమెరికాపై యుద్ధం ప్రకటించి పోయి గుహల్లో కూర్చున్నాడు' అని, యుక్త వయసులో ఉన్న ఫొటో పెట్టి 'బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయ్యి లాడెన్ కరాటే నేర్చుకున్నాడని, ఇక లాడెన్ ఆరుగురి పిల్లల ఫొటో పెట్టి 'ఈ ఆరుగురు లాడెన్కు ఉన్న 25 మంది సంతానంలో కొందరు. లాడెన్ మనుషులను చంపడమే కాకుండా.. అందుకు భిన్నమైన మరెన్నో ఎన్నో పనులు చేస్తాడని చెప్పేందుకు ఇదొక నిదర్శనం' అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement