మా ఇష్టాన్ని ఎంజాయ్‌ చేస్తారు– రామ్‌గోపాల్‌ వర్మ | Naina Ganguly Speech At RGV Maa Istam Movie Pressmeet | Sakshi
Sakshi News home page

మా ఇష్టాన్ని ఎంజాయ్‌ చేస్తారు– రామ్‌గోపాల్‌ వర్మ

Published Mon, Apr 4 2022 6:06 AM | Last Updated on Mon, Apr 4 2022 6:06 AM

Naina Ganguly Speech At RGV Maa Istam Movie Pressmeet - Sakshi

నైనా గంగూలీ, రామ్‌గోపాల్‌ వర్మ, అప్సర,రామ సత్యనారాయణ

లెస్బియన్స్‌ పాత్రల్లో నైనా గంగూలీ, అప్సరా రాణి బాగా నటించారు. వారిద్దరూ తమ పేరెంట్స్‌తో మాట్లాడి ఈ సినిమా చేశారు. మా సినిమా చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’. ఈ నెల 8న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘వర్మతో పని చేయడం కిక్‌ ఇస్తుంది.

‘మా ఇష్టం’లాంటి సినిమాని వేరే ఏ డైరెక్టర్‌ చేయలేడని సగర్వంగా చెబుతాను. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్‌ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘హీరోకి జోడీగా నటించడం చాలా ఈజీ. కానీ, అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడం చాలా కష్టం’’ అన్నారు నైనా గంగూలీ. ‘‘ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటి? అనేది ఈ సినిమా. ఇందులో రొమాంటిక్‌ పాటలో నటించడం ఎంతో థ్రిల్‌గా అనిపించింది’’ అన్నారు అప్సరా రాణి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement