గిల్లీ–దండా ఆట | Gilly-Dandaa film shooting started in Hyderabad. | Sakshi
Sakshi News home page

గిల్లీ–దండా ఆట

Published Thu, Aug 3 2017 12:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

గిల్లీ–దండా ఆట

గిల్లీ–దండా ఆట

నటరాజ్, రోణిక సింగ్‌ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘గిల్లీ–దండా’. ‘అరుంధతి’ శ్రీను దర్శకత్వంలో జె.వీరేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో ‘గిల్లీ–దండా’ ఆట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో, అనంతపురం, గుత్తి, బెంగళూరు, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు నిర్మాత జె. వీరేష్‌. ఈ చిత్రానికి కెమెరా: జి.జె. కృష్ణ, సంగీతం: రఘు కుంచె, నిర్వహణ: రాంబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement