
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. సోమవారం జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఉమామహేశ్ బంగారు పతకం నెగ్గిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో.. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కూడా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఉమామహేశ్–ఇషా తక్సాలె (భారత్) జోడీ 16–8 పాయింట్ల తేడాతో అన్వీ రాథోడ్–అభినవ్ షా (భారత్) జంటను ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment