
చెంగ్డూ: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్లు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు. పంజాబ్ అమ్మాయి సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో, వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకుంది.
టీమ్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 3527 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ 462.9 పాయింట్లతో విజేతగా నిలువగా, ఆశి చౌక్సీ 461.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెలిచింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్ చీమా, వరుణ్ తోమర్, అన్‌మోల్ జైన్‌లతో కూడిన భారత జ ట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment