15న ‘నిట్’ స్నాతకోత్సవం | On 15 'niet' convocation | Sakshi
Sakshi News home page

15న ‘నిట్’ స్నాతకోత్సవం

Published Sun, Oct 13 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

On 15 'niet' convocation

 

=    8 మందికి గోల్డ్‌మెడల్స్ ప్రదానం  
=     1,323 మందికి డిగ్రీ పట్టాల అందజేత
  =   ఖరారు కాని కేంద్ర మంత్రి పల్లంరాజు రాక
 =     ముఖ్యఅతిథిగా కృష్ణా ఎం ఎల్ల    
  =     నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు వెల్లడి

 
 నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : కాజీ పేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11వ స్నాతకోత్సవాన్ని ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు  నిట్ డెరైక్టర్, ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. నిట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గం టలకు నిట్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమంలో 1,323 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 773 మందికి, పీజీ కోర్సుల్లో 506 మందికి, పీహెచ్‌డీ స్కాలర్స్ 44 మందికి పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. స్నాత కోత్స వంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 8 మంది బీటెక్  అండర్ గ్రాడ్యుయేట్లను గోల్డ్‌మెడల్స్‌కు ఎంపిక చేశామన్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఓవరాల్ గోల్డ్‌మెడల్‌ను నిట్  బీటెక్ విద్యార్థి(మెకానికల్ ఇంజినీరింగ్) పొన్నపల్లి చైతన్యసాయికి అందజేయనున్నామని చెప్పారు.

గత స్నాతకోత్సవంలో 23 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు ఇవ్వగా, ఈసారి 44 మందికి ఇవ్వనుండడమే ఇందుకు నిదర్శనమన్నా రు. డీన్, ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ సాధారణంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పీహెచ్‌డీ ఎక్కువగా చేస్తారని.. ఈసారి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు చేసిన 12 మందికి పీహెచ్‌డీ పట్టాలు ఇవ్వనుండడం విశేషమన్నారు.
 
 స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా కృష్ణా ఎం ఎల్ల

 స్నాతకోత్సవానికి నిట్ వరంగల్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణా ఎం ఎల్ల ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాన్వొకేషన్‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజు హాజరవుతారని అనుకున్నామని.. అయితే మంత్రి రాక అధికారికంగా ఖరారు కాలేదని చెప్పారు. అయినా షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో నిట్ కాన్వొకేషన్ ఇన్‌చార్జ్, ప్రొఫెసర్ రమేష్, పీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు.

 మెడల్స్ అందుకునేది వీరే..

 నిట్‌క్యాంపస్ : మెకానికల్ ఇంజినీరింగ్‌లో వరంగల్‌కు చెందిన పొన్నపల్లి చైతన్యసాయి నిట్  గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన గౌరవ్‌జైన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్(ఈఈఈ)లో విశాఖపట్నంకు చెందిన లోకేష్‌చంద్ర, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ఈసీఈ)లో లక్నోకు చెందిన అభిమన్య శ్రీవాత్సవ, మెటలార్జికల్, మెటీరియల్ ఇంజినీరింగ్‌లో అలహాబాద్‌కు చెందిన ప్రభాత్‌కుమార్‌సింగ్, కెమికల్ ఇంజినీరింగ్‌లో బెంగళూర్‌కు చెందిన గోకుల్ హరిహరణ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జలందర్‌కు చెందిన అమిత్‌జోషి, చెన్నైకి చెందిన ప్రియవతి బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు.
 
 సంతోషంగా ఉంది..: చైతన్యసాయి


 నిట్ ఇన్‌స్టిట్యూట్ గోల్డ్‌మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని చైతన్యసాయి అన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ బోధన ఉంటుందని చెప్పారు. తన తండ్రి హరికృష్ణప్రసాద్ నిట్‌లోని ఈసీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఇక్కడే మెడల్ తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. కాగా, ప్రస్తుతం చైతన్యసాయి ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉద్యోగం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement