సాక్షి, హన్మకొండ: వరంగల్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దాడి ఘటన కలకలం సృష్టించింది. జూనియర్ విద్యార్థులపై భౌతికంగా దాడిచేసిన తొమ్మిది మంది సీనియర్లను నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు మంగళవారం ఏడాది పాటు సస్పెండ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల్లో సెమిస్టర్ పరీక్షలు జరగనుండగా విద్యార్థులను సస్పెండ్ చేసే వరకు పరిస్థితి ముదరడం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 24వ తేదీన ఇద్దరు బీటెక్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ విద్యార్థులు నిట్ క్యాంపస్‌లో చితకబాదారు. విషయం తెలుసుకున్న జూనియర్లు మరుసటి రోజు సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెచ్చిపోయిన సీనియర్లు వారిపై చేయిచేసుకున్నారు. దీనిపై 26న నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావుకు బాధితులు ఫిర్యాదు చేశారు. అదేరోజు వారి తల్లిదండ్రులు కూడా నిట్ డెరైక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సీనియర్లు ఉద్దేశపూర్వకంగానే తరచూ గొడవలకు దిగుతున్నారనే విషయం విచారణలో వెల్లడైంది. మరోసారి నిట్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిట్ క్రమశిక్షణ యాక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై మంగళవారం సాయంత్రం నిట్ యాజమాన్యం, అకడమిక్ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్‌లతో పాటు వివాదంతో సంబంధం ఉన్న విద్యార్థుల విభాగాలైన మెకానికల్, బయోటెక్నాలజీ, మెటలర్జికల్ విభాగాధిపతులు సమావేశమయ్యూరు. బాధ్యులైన తొమ్మిది మంది సీనియర్లను సస్పెండ్ చేస్తూ నిట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సస్పెండైన విద్యార్థులు ఏడాది పాటు వరంగల్ నిట్ క్యాంపస్‌లో ఉండకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో హైదరాబాద్, విజయవాడ,ై వెజాగ్ ప్రాంతాల వారే ఎక్కువమంది ఉన్నారు.
‘నిట్’లో జూనియర్లపై సీనియర్ల దాడి
Published Wed, Jan 29 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement