న్యూఢిల్లీ: వర్ధమాన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్, 60 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సాక్షి స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. 53 కేజీల ఫైనల్లో వినేశ్, మమతా రాణిని ఓడించగా...శీతల్, సీమాలకు కాంస్యాలు దక్కాయి. 60 కేజీల తుది పోరులో సాక్షి చేతిలో ఓడిన మనీషా, రజతంతో సంతృప్తి పడింది. ఈ విభాగంలో బబిత, అనిత కాంస్యాలు గెలుచుకున్నారు. 69 కేజీల కేటగిరీలో నవజోత్, గీతిక స్వర్ణ, రజతాలు సాధించారు. పురుషుల విభాగంలో మన్‌జీత్ (71 కేజీ), గౌరవ్‌శర్మ (59 కేజీలు), నవీన్ (130 కేజీలు) స్వర్ణాలు అందుకున్నారు.
వినేశ్, సాక్షిలకు స్వర్ణాలు
Published Thu, Dec 31 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM