
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సోట్‌విల్లీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో నీరజ్ జావెలిన్‌ను 85.17 మీటర్ల దూరం విసిరి పసిడి గెలుచుకున్నాడు. ఆండ్రియన్ మర్దారే (మాల్డోవా–81.48 మీటర్లు), ఎడిస్ మటుసేవిసియస్ (లిథువేనియా–79.31 మీటర్లు) వరుసగా రజత, క్యాంస్యాలు దక్కించుకున్నారు.
2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత కెశోర్న్ వాల్కాట్ ( ట్రినిడాడ్–78.26 మీటర్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20 ఏళ్ల నీరజ్ ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment