బాగ్ధాద్ (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీ తొలి అంచె టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో విజేతగా నిలిచాడు.
వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ 7–3తో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్‌ను ఓడించాడు. టీమ్ విభాగం ఫైనల్లో ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 6–2తో ఇస్లామ్, రూబెల్, అలీఫ్‌లతో కూడిన బంగ్లాదేశ్ జట్టుపై గెలిచింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధీరజ్–సిమ్రన్‌జోడీ 6–0తో దియా–ఇస్లామ్ జంట (బంగ్లాదేశ్)పై నెగ్గింది.
ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్నాడు. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నలో ధీరజ్ రజత పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment