
జకార్తా: ఒక ఈవెంట్‌లో మూడు పతకాలు భారత్‌కే వచ్చాయి. మూడు త్రివర్ణ పతాకాలు ఒకేసారి రెపరెపలాడాయి. ఈ దృశ్యం పారా ఆసియా క్రీడల్లో కనువిందు చేసింది. హైజంప్‌లో భారత దివ్యాంగ అథ్లెట్లే పతకాలన్నీ కొల్లగొట్టారు.
పురుషుల హైజంప్ టి42/63 కేటగిరీలో శరద్ కుమార్ (1.90 మీటర్లు) రెండు రికార్డులు నెలకొల్పి స్వర్ణం గెలుపొందగా... వరుణ్ భాటి (1.82 మీటర్లు), తంగవేలు మరియప్పన్ (1.67 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. గురువారం ఆరోరోజు పోటీల్లో ఒక్క అథ్లెటిక్స్‌లోనే డజను పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.