ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో విశేషంగా రాణించిన భారత జట్టు రెండు స్వర్ణాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రెండో డివిజన్లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో తొలుత భారత మహిళల జట్టు 3-1తేడాతో లక్సెంబర్గ్‌పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకోగా, ఆపై పురుషుల జట్టు 3-2 తేడాతో బ్రెజిల్ను మట్టికరిపించి పసిడిని సొంతం చేసుకుంది.
25 నుంచి 48 ర్యాంకింగ్స్ మధ్యలో ఉన్న జట్లు రెండో డివిజన్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే 25-26వ స్థానాల కోసం బ్రెజిల్తో భారత పురుషుల జట్టు, లక్సెంబర్గ్‌తో భారత మహిళల జట్టు తలపడ్డాయి.