స్విమ్మింగ్‌లో బంగారు పతకాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్విమ్మింగ్‌లో జిల్లా ఉద్యోగులు ఆరుగురు బంగారు పతకాలు సాధించారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రవిశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో బుధవారం జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఉద్యోగులు ఈ పతకాలు సాధించారన్నారు.
విజేతలు ఈ నెల 18 నుంచి 20 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగే జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు హాజరవుతారన్నారు. పతకాలు సాధించిన ఉద్యోగులను జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, గిరీష్, స్విమ్మింగ్ పూల్ అధినేత వెంకటరెడ్డి అభినందించారు.
పేరు డిపార్ట్‌మెంట్ ఈవెంట్
త్యాగరాజు హెల్త్ డిపార్ట్‌మెంట్ 50 మీ. ఫ్రీ సై్టల్
బాబాసాహెబ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ 50 మీ. ఫ్రీ సై్టల్
గంగాధర జిల్లా పరిషత్ 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్
అమరనాథ్‌రెడ్డి జిల్లా పరిషత్ 50 మీ. బ్రెస్ట్ స్ట్రోక్
కుళ్లాయప్ప ఎంఈఓ, గుంతకల్లు 100 మీ. బ్యాక్ స్ట్రోక్
సూర్యబాబు టీచర్, శెట్టూరు 50 మీ. బ్యాక్ స్ట్రోక్