న్యూఢిల్లీ: నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అడ్‌హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపు అంశం కోర్టుకెక్కింది. అండర్–20 ప్రపంచ చాంపియన్ అంతిమ్ పంఘాల్, అండర్–23 ఆసియా చాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
గురువారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ వీరిద్దరికి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలు, ప్రాతిపదిక ఏమిటని రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్‌హక్ కమిటీని ప్రశ్నించారు. డబ్ల్యూఎఫ్‌ఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని వెయిట్ కేటగిరీలకు సెలక్షన్ ట్రయల్స్ తప్పనిసరి అని పిటిషనర్ల తరఫు న్యాయ వాది వినిపించగా, జడ్జి తదుపరి విచారణన నేటికి వాయిదా వేశారు.
బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ను మంజూరు చేసింది. మైనర్ రెజ్లర్ సహా పలువురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు గత నెల 15న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్ని విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ షరతులతో కూడిన బెయిల్ ఇచి్చంది. మంగళవారం కేవలం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తాజాగా పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment