Tokyo Olympics: Bajarang Punia Old Video Viral, కాంస్య పతక పోరు; భజరంగ్‌ పూనియా వీడియో వైరల్‌ - Sakshi
Sakshi News home page

Bajrang Punia: కాంస్య పతక పోరు; భజరంగ్‌ పూనియా వీడియో వైరల్‌

Published Fri, Aug 6 2021 5:34 PM | Last Updated on Fri, Aug 6 2021 6:46 PM

Tokyo Olympics: Bajarang Punia Bronze Medal Match Randeep Huda Shares Old Video - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌ అజ‌ర్‌బైజాన్ రెజ్ల‌ర్ హ‌జి అలియేవ్‌తో జ‌రిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్‌ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్‌ రేపు కాంస్య పతక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా భజరంగ్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను బాలీవుడ్‌ స్టార్‌ రణదీప్‌ హుడా ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఆ వీడియోలో భజరంగ్‌ మ్యాచ్‌ సందర్భంగా బౌట్‌కు సిద్ధమవుతుండగా ఇంతలో ఒక వ్యక్తి రింగ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే భజరంగ్‌ అతన్ని రింగ్‌ బయటే ఆపేందుకు ప్రయత్నించాడు. అతను ఆగకపోవడంతో బజరంగ్‌ అతన్ని రింగ్‌ నుంచి ఎత్తిపడేశాడు. ఆ తర్వాత మళ్లీ రింగ్‌లోకి వచ్చి విజయసంకేతాన్ని చూపించాడు. దీనిని షేర్‌ చేసిన రణదీప్‌ ఇలాంటి ప్రదర్శనను ఒలింపిక్స్‌లో చూపించాలి అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా సెమీస్‌లో ఓటమి పాలైన పూనియా కాంస్య తెస్తాడేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement