సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు చివరి రోజున నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డెన్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. అరంగ్రేంట్రంలోనే భజరంగ్ పూనియా కాంస్యం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా, భజరంగ్ పూనియాకులకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ
‘‘నీరజ్ చోప్రా ఈ రోజు టోక్యోలో సాధించని విజయం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజు టోక్యోలో చర్రిత సృష్టించావ్. అద్భుతమైన అభిరుచితో ఆడావు.. అసమానమైన గ్రిట్ చూపించావు. స్వర్ణం గెలిచినందుకు నీకు అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS
— Narendra Modi (@narendramodi) August 7, 2021
Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
నీవు సాధించిన విజయం యువతకు స్ఫూర్తి: రామ్‌నాథ్ కోవింద్
‘‘నీరజ్ చోప్రా సాధించిన అపూర్వ విజయం! మీరు మీ మొదటి ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్‌ను ఇంటికి తీసుకువచ్చారు. మీ ఫీట్ మా యువతకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయం పట్ల భారతదేశం ఉప్పొంగిపోతుంది! మీకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
Unprecedented win by Neeraj Chopra!Your javelin gold breaks barriers and creates history. You bring home first ever track and field medal to India in your first Olympics. Your feat will inspire our youth. India is elated! Heartiest congratulations!
— President of India (@rashtrapatibhvn) August 7, 2021
A special moment for Indian wrestling!
— President of India (@rashtrapatibhvn) August 7, 2021
Congratulations to Bajrang Punia for winning the Bronze at #Tokyo2020. You have distinguished yourself as an outstanding wrestler with untiring efforts, consistency and tenacity over the years. Every Indian shares the joy of your success!
నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించిన హరియాణా ప్రభుత్వం
చండిగఢ్: 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో హరియాణా సర్కార్ నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment