
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా- సంగీత ఫొగట్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నవంబరు 25న మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకలతో కాబోయే వధూవరుల ఇళ్లలో సందడి నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో హల్దీ, మెహందీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంగీత ఫొగట్‌తో పాటు, ఆమె సోదరీమణులు, రెజర్లు గీత ఫొగట్, బబితా ఫొగట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హల్దీ వేడుకలో భాగంగా పసుపు రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సంగీతకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!)
ఇక రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భజరంగ్ పూనియా వరల్డ్ నెంబర్‌వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫొగట్ సిస్టర్స్‌లో అందరికంటే చిన్నవారైన సంగీత ప్రేమించిన అతడు, పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సంగీత తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ సైతం 'ఇది వారిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని, పిల్లల అభిప్రాయాలను గౌరవించడమే మా కర్తవ్యమని' పేర్కొన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్ వాయిదా పడటంతో ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment