
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు ఈనెల 22, 23 తేదీల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి... నిరసన చేపట్టిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్, సంగీత ఫొగపాట్, సత్యవర్త్, జితేందర్‌లకు ట్రయల్స్‌లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు.
అభిషేక్‌కు కాంస్యం
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ తొలి రోజు భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. పురుషుల 10 వేల మీటర్ల విభాగంలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. అభిషేక్ 29 నిమిషాల 33.26 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (59.10 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment