న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాది నాలుగో స్వర్ణ పతకం సాధించాడు. జార్జియాలో జరుగుతున్న తిబిలిసి గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో బజరంగ్ 2–0 పాయింట్ల తేడాతో పీమన్ బిబ్యాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది డాన్ కొలోవ్–నికోలా ప్రెటోవ్ టోర్నీలో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, అలీ అలియెవ్ టోర్నీలో బజరంగ్ స్వర్ణ పతకాలు సాధించాడు. 90 సెకన్లలో సుశీల్ ఓటమి...: బెలారస్‌లో జరుగుతున్న మెద్వేద్ రెజ్లింగ్ టోర్నీలో భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ కేవలం 90 సెకన్లలో చేతులెత్తేశాడు. పురుషుల 74 కేజీల విభాగం ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్లో బెక్‌జోద్ అబ్దురఖ్‌మోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ ఓడిపోయాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో తొలి రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత సుశీల్ పాల్గొంటున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment