న్యూఢిల్లీ: కరోనా కాలంలో విదేశీ కోచ్‌ల వెంట పడకుండా... 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు భారతీయ కోచ్‌ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో రవి రజతం... బజరంగ్ కాంస్యం సాధించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య వీరిద్దరి కోసం భారత్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ కోచ్‌లను నియమించే పనిలో ఉంది. ‘విదేశీ కోచ్‌లు వారి దేశంలోనే 80 శాతం కోచింగ్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు కానీ భారత్‌లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందువల్లే స్వదేశీ కోచ్‌పై దృష్టి పెట్టాను’ అని ఉన్న బజరంగ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment