Wrestlers Protest: Panel asked us for audio, video proof.. member said Brij Bhushan like father figure - Sakshi
Sakshi News home page

తండ్రి లాంటి వారు చనువుగా తాకితే అపార్థం చేసుకుంటారా? ఆడియో, వీడియో రుజువులు ఉన్నాయా?

Published Tue, May 16 2023 8:50 AM | Last Updated on Tue, May 16 2023 9:55 AM

Wrestlers Protest: Panel Asked Us For Audio Video Proof Said Brij Bhushan Like Father Figure - Sakshi

నిరసన చేపట్టిన రెజ్లర్లు- బ్రిజ్‌ భూషణ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్‌ రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌ హెచ్చరించారు.

రుజువులు ఉన్నాయా?
‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, ఒలింపియన్ల మద్దతు కోరతాం. విదేశీ ఆటగాళ్లు కూడా ఇందులో గళం విప్పేలా ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని వినేశ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన కమిటీ తమను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో, ఆడియో రుజువులు అడిగిందని రెజ్లర్లు చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది.

తండ్రిలాంటి వారు తాకితే కూడా అపార్థాలా?
కమిటిలోని ఓ మెంబర్‌ ఓ మహిళా రెజ్లర్‌తో మాట్లాడుతూ.. తండ్రిలాంటి బ్రిజ్‌ భూషణ్‌ ఏదో తెలియక, చనువుగా మిమ్మల్ని తాకితే దానిని కూడా అపార్థం చేసుకుంటారా అని అన్నట్లు వారు చెప్పారని తెలిపింది. డబ్ల్యూఎఫ్‌ఐ సిబ్బంది, కోచ్‌, బ్రిజ్‌ భూషణ్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లంతా తమ విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారని మరో రెజ్లర్‌ పేర్కొన్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి 
ఇటాలియన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ పోరాటం ముగిసింది. రోమ్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–2, 6–7 (8/10), 10–12తో డిమినార్‌–కుబ్లర్‌ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సూపర్‌ టైబ్రేక్‌లో బోపన ద్వయం ఒక మ్యాచ్‌ పాయింట్‌ చేజార్చుంది.  బోపన్న జోడీకి 29,300 యూరోల (రూ. 26 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

చదవండి: ICC: హెల్మెట్‌ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్‌ తీసిన పరుగులు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement