న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్ల నిరసన జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. నిరసనకు 18వ రోజైన గురువారం రెజ్లర్లు ‘బ్లాక్‌డే’గా పాటించారు.
బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా నల్ల బ్యాండ్‌లు ధరించి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ‘ఈ రోజు మేం బ్లాక్‌డే పాటించాం. దేశం మొత్తం మాకు అండగా నిలుస్తోంది కాబట్టి విజయం సాధిస్తామని నమ్ముతున్నాం. న్యాయం దక్కే వరకు మా నిరసన కొనసాగుతుంది’ అని బజరంగ్, సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ అన్నారు.
ఇది కూడా చదవండి: భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’
దోహా: ఏషియన్ కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్న మెంట్‌లో భారత జట్టుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. వచ్చే ఏడాది జనవరిలో ఖతర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా (ప్రపంచ 29వ ర్యాంక్), ఉజ్బెకిస్తాన్ (74వ ర్యాంక్), సిరియా (90వ ర్యాంక్) జట్లతో కలిసి భారత్ (101వ ర్యాంక్) ఉంది.
వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. 67 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత జట్టు 1964లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భారత్ 1984లో, 2011లో, 2019లో ఈ టోర్నీకి అర్హత సాధించినా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment