న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌కు సమాయత్తమయ్యేందుకు భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదం లభించింది.
బజరంగ్ 36 రోజుల శిక్షణ కోసం కిర్గిస్తాన్‌ను... వినేశ్ 18 రోజుల శిక్షణకు హంగేరిని ఎంచుకున్నారు. ఆగస్టు రెండో వారంలో ట్రయల్స్ జరగనుండగా... వచ్చే వారంలో వీరు విదేశాలకు బయలుదేరుతారు.
వినేశ్ వెంట ఫిజియోథెరపిస్ట్ అశ్విని జీవన్ పాటిల్, కోచ్ సుదేశ్, ప్రాక్టీస్ భాగస్వామిగా సంగీత ఫొగాట్... బజరంగ్ వెంట కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెర పిస్ట్ అనూజ్, ప్రాక్టీస్ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెళతారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల కేసును కోర్టులోనే తేల్చుకుంటామని బజరంగ్, వినేశ్ ప్రకటించారు.
చదవండి: Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment