ఢిల్లీ: రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర బయటపడిందని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అన్నారు. శుక్రవారం వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ రెజ్లర్లు నాకు వ్యతిరేకంగా 2023 జనవరి 18న ఆందోళన ప్రారంభించారు. ఆ రోజే నేను అసలు విషయం చెప్పాను. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. హార్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పా. నేను చెప్పింది నేడు నిజమైంది. రెజ్లర్లు నిరసన వల్ల హర్యానా మహిళలు అవమానం ఎదుర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు, నిరసన తెలిపిన రెజ్లర్లు బాధ్యత వహించాలి. కాంగ్రెస్ నేతలు మహిళా రెజ్లర్ల గౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్ స్క్రిప్ట్ ప్రకారమే నాపై రెజ్లర్ల నిరసన జరిగింది’’ అని అన్నారు.
అదే విధంగా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజరటంపై స్పందిస్తూ.. ఆమె ఒకే రోజు రెండు వేర్వేరు విభాగాల్లో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు. అందుకే తుది పోరులో ఆమె అనార్హతకు గురయ్యేలా దేవుడే శిక్ష విధించాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment