
వినేశ్ ఫొగాట్ (PC: PTI)
Indian Wrestler Vinesh Phogat: ‘పలువురు కోచ్‌లు అదే పనిగా లక్నోలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు. 10, 12 మంది అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పను. ప్రధానిని కలిసే అవకాశమిస్తే ఆయనకే వివరిస్తా.
నేను ఇదివరకు ఒకసారి బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించారు’ అని కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ విలేకర్ల ముందు విలపించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మీడియా ఎదుట ఆవేదన పంచుకున్నారు.
కాగా చాలా కాలంగా బ్రిజ్‌భూషణ్ తమని లైంగికంగా వేధిస్తున్నారని భారత మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
సంగీతా ఫొగాట్ భర్త, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత బజరంగ్ పూనియా, అతని కోచ్ సుజిత్ మాన్ సహా ఫిజియో ఆనంద్ దూబే వారికి మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బజరంగ్ మాట్లాడుతూ తమ పోరాటం ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)పై కాదని... కేవలం బ్రిజ్‌భూషణ్ నియంతృత్వంపైనే అని స్పష్టం చేశారు.
అయితే, డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ బ్రిజ్‌భూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేయడం గమనార్హం. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఉరేసుకొంటానని సవాల్ చేశారు. ఓ పారిశ్రామిక వేత్త ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్
ENG vs SA: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment