Sexual harassment allegations on WFI chief could not be proved: Reports - Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడికి ఊరట?

Published Fri, Apr 14 2023 10:04 AM | Last Updated on Fri, Apr 14 2023 11:42 AM

Allegations On WFI Chief Brij Bhushan Sharan Singh Could Not Proved: Reports - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను నిరూపించడంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు విఫలమయ్యారని తెలిసింది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది.

ఈ కమిటీ తమ నివేదికను క్రీడా శాఖకు సమర్పించింది. కొన్నేళ్లుగా బ్రిజ్‌ భూషణ్‌ రెజర్లను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయనను ఈ పదవి నుంచి తప్పించాలని ఆరోపిస్తూ జనవరిలో జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్లు నిరసన చేపట్టారు.

అయితే బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు నిజమేనని నిరూపించేందుకు రెజ్లర్లు వినేశ్, సాక్షి, బజరంగ్‌ పర్యవేక్షణ కమిటీకి కచ్చితమైన ఆధారాలు సమర్పించలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలువురిని పర్యవేక్షణ కమిటీ విచారించినా ఒక్కరు కూడా బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా చెప్పలేదని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.

చదవండి:   అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్​ మొత్తం వాళ్లకే: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement