బీసీసీఐ షాకిచ్చింది.. చహల్‌ అక్కడ అలా! | Wrestler Sangeeta Phogat lifts Chahal on Back Twirls Him Around During Party | Sakshi
Sakshi News home page

చహల్‌ను ఎత్తిపడేసిన సంగీత.. భయంతో వణికిపోయిన స్పిన్నర్‌!

Published Sat, Mar 2 2024 4:26 PM | Last Updated on Sat, Mar 2 2024 4:42 PM

Wrestler Sangeeta Phogat lifts Chahal on Back Twirls Him Around During Party - Sakshi

పాపం చహల్‌.. సంగీత దెబ్బకు వణికిపోయాడు (PC: Insta)

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ చాలా కాలంగా ఆట​కు దూరంగా ఉన్నాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా బరిలోకి దిగిన అతడు మళ్లీ పునరాగమనం చేయలేదు.

షాకిచ్చిన బీసీసీఐ
వన్డే ప్రపంచకప్‌-2023 జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే ఛాన్స్‌ ఇవ్వలేదు సెలక్టర్లు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టుతో పాతుకుపోవడంతో చహల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలోనూ యజువేంద్ర చహల్‌కు మొండిచేయి చూపింది బీసీసీఐ.

ఐపీఎల్‌లో కింగ్‌
ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్‌లోనే మళ్లీ యుజీ స్పిన్‌ మాయాజాలాన్ని చూసే వీలుంది. గత సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడిన చహల్‌ 14 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్‌గా చహల్‌ చరిత్రకెక్కాడు.

చుక్కలు చూపించిన సంగీత
ఇదిలా ఉంటే.. తనకు దొరికిన విరామ సమయాన్ని భార్య, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ కోసం కేటాయించాడు చహల్‌. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్‌ దిఖ్లాజా షోతో బిజీగా ఉంది. భారత రెజ్లర్‌ సంగీత ఫొగట్‌ కూడా ఈ టీవీ షోలో పాల్గొంది. 

ఈ నేపథ్యంలో విరామ సమయంలో చహల్‌తో కలిసి సంగీత సందడి చేసింది. అతడిని గొర్రెపిల్లలా వీపుపై వేసుకుని గిరాగిరా తిప్పుతూ తన రెజ్లింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఆ సమయంలో చహల్‌ కిందపడతానేమోన్న భయంతో దింపేయమంటూ వేడుకున్నా ఆమె వినలేదు. 

ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఫొగట్‌ సిస్టర్స్‌లో చిన్నవారైన సంగీత ఫొగట్‌.. స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియాను వివాహమాడింది. ఇక ఝలక్‌ దిఖ్లాజా షోలో పాల్గొన్న సంగీత తాజాగా ఎలిమినేట్‌ అయింది. ధనశ్రీ వర్మ మాత్రం టాప్‌-5లో కొనసాగుతోంది.

చదవండి: అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement