
టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది.
ఇటీవల కాలంలో చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్‌లు సైతం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేశారు. చాహల్ అయితే ఏకంగా ఆమె ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో చాహల్-ధనశ్రీ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ధనశ్రీకి రూ. 60 కోట్లు..?
ఈ క్రమంలో తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జోడీ ఎప్పటికప్పుడు వీడియోలు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించేవారు.
కానీ ఇటీవల కాలంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాగా వీరి విడాకులపై వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని చాహల్-ధనశ్రీ తీవ్రంగా ఖండిచారు. కానీ ఈసారి మాత్రం వారిద్దరూ విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.
తాజాగా ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ.. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారు. కానీ నిజానికి విలువెక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. చాహల్ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని.. బయటకొస్తున్న వార్తలు నిజాలు కావచ్చు, కాకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.
చదవండి: సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు
Comments
Please login to add a commentAdd a comment