శృంగార చిత్రానికి పచ్చజెండా! | ​Raveena Tandon replaces Sangeeta Bijlani | Sakshi
Sakshi News home page

శృంగార చిత్రానికి పచ్చజెండా!

Published Mon, Jun 30 2014 11:59 PM | Last Updated on Tue, Sep 18 2018 7:52 PM

శృంగార చిత్రానికి పచ్చజెండా! - Sakshi

శృంగార చిత్రానికి పచ్చజెండా!

 గ్లామరస్ పాత్రలు చేయడంలో రవీనా టాండన్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినననే తరహాలో గ్లామర్‌లో ఏ తరహా అయినా చేయడానికి రెడీగా ఉంటారామె. తాజాగా ఆమె ఓ శృంగార చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘షాబ్’. ఆ చిత్రదర్శక, నిర్మాత ఒనిర్ తొలుత ఈ పాత్రకు సంగీతా బిజిలానీని తీసుకోవాలనుకున్నారు. ఈ చిత్రకథ మొత్తం ఆమెకు చెప్పారట.
 
 కథపట్ల సంగీతాకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఈ చిత్రంలో ఉన్న ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడలేదట. అందుకని కాదన్నారని సమాచారం. ఆ తర్వాత రవీనా టాండన్‌ని సంప్రదించారట ఒనిర్. శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని చెప్పి, రవీనా ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారట. శృంగార ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఫార్టీ ఫ్లస్‌లో ఉన్న రవీనా ఏ స్థాయిలో విజృంభిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement