Watch: Vijay Devarakonda Released Horror Action Thriller Movie Masooda Trailer - Sakshi
Sakshi News home page

Masooda Trailer: అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. 'మసూద' ట్రైలర్ రిలీజ్

Published Sat, Nov 12 2022 6:29 PM | Last Updated on Sat, Nov 12 2022 7:10 PM

Vijay Devarakonda Released Harror Action Thriller Movie Masooda Trailer - Sakshi

సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు

 విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ..' ట్రైలర్ అద్భుతంగా ఉంది.  టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్‌‌గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. వారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. 

(చదవండి: పాన్‌ ఇండియా చిత్రంగా 'మసూద')

ట్రైలర్ విషయానికి వస్తే.... 'భవిష్యత్తు అనేది మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్‌ చూస్తే పూర్తిస్థాయి హారర్‌ మూవీని తలిపించేలా ఉంది. దెయ్యం పట్టిన అమ్మాయి చుట్టు కథ మొత్తం తిరుగుతోందని ట్రైలర్‌లో అర్థమవుతోంది. తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ సాగిన ట్రైలర్.. ఒక్కసారిగా హర్రర్ సీన్స్‌తో భయపెట్టేస్తోంది.

‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’ అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే..  హారర్ మూవీ చెప్పకనే చెప్పేశారు ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి, పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌వీసీ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement