ఎర్రచందనం అక్రమ కేసులో అరెస్టైన ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ(26) ని చిత్తూరు పోలీసులు బుధవారం ఉదయం పాకాల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. చిత్తూరు నుంచి బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆమెను ప్రత్యేక వాహనంలో పట్టిష్ట బందోబస్తు నడుమ పాకాల కు తీసుకొచ్చారు.