ఎన్కౌంటర్పై రాజ్నాథ్కు సీఎం వివరణ
ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన పలు రజకీయ పార్టీలు ఎన్కౌంటర్పై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం కేంద్ర మంత్రికి ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ తీరు తెన్నుల్ని రాజ్నాథ్కు వివరించారు. అంతకు ముందు గవర్నర్ నరసింహన్కు కూడా ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు.