తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ | chandrababu naidu write a letter to tamilanadu cm pannir selvam | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ

Published Fri, Apr 10 2015 1:17 PM | Last Updated on Sat, Jul 28 2018 2:48 PM

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ - Sakshi

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తమిళనాడు ముఖ్యమత్రి పన్నీర్ సెల్వంకు లేఖ రాశారు.  శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే పూర్తి వివరాలు సమర్పిస్తామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.  

కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని  తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పన్నీరు సెల్వం పేర్కొన్నారు. ఆయన లేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement