కలిసి మాట్లాడుకుందాం | Chandrababu Naidu writes to Revanth Reddy: proposes meeting on July 6 | Sakshi
Sakshi News home page

కలిసి మాట్లాడుకుందాం

Published Tue, Jul 2 2024 5:04 AM | Last Updated on Tue, Jul 2 2024 5:04 AM

Chandrababu Naidu writes to Revanth Reddy: proposes meeting on July 6

తెలంగాణ సీఎంకు చంద్రబాబు లేఖ 

ఈనెల 6న హైదరాబాద్‌లో  భేటీకి ప్రతిపాదన

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో..  పునర్వ్యవస్థీకరణ చట్టంవల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే అనేక చర్చలు జరిగాయని, ఇవన్నీ సంక్షేమం, పురోగతిపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి సామరస్యంగా ముందుకెళ్లడం అత్యవసరమని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లో కలుద్దామని రేవంత్‌రెడ్డికి ఆయన ప్రతిపాదించారు. ముఖాముఖి సమావేశం నిర్వహించుకుని క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చలు జరుపుదామన్నారు. ఏపీ, తెలంగాణకు పరస్పర ప్రయోజనం కలిగే పరిష్కారాలను కనుగొని అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement