మీ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నా
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం పక్షాన ఈనెల ఆరో తేదీన ముఖాముఖి కలుద్దామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వనించారు. 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్‌లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ లేఖ రాశారు. ‘మీరు ఈనెల ఒకటో తేదీన లేఖ రాసినందుకు కృతజ్ఞతలు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మీకు అభినందనలు. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీరు దేశంలోనే అరుదైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు నన్ను కలవాలన్న మీ ప్రతిపాదనతో నేను ఏకీభవిస్తున్నాను. పునరి్వభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి మన భేటీ ఉపయోగపడుతుంది. అవసరం కూడా. వ్యక్తిగతంగా కలవడం పరస్పర సహకారానికి బలమైన పునాది వేస్తుంది. అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించగలం..’అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment