ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ | pannir selvam wrote a letter to chandrabu naidu | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

Published Tue, Apr 7 2015 5:35 PM | Last Updated on Sat, Jul 28 2018 2:48 PM

ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ - Sakshi

ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు.

స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో ఏపీ డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. పలు తమిళ రాజకీయ పార్టీలు ఆంధ్రా ఆస్తులపై దాడి చేస్తామని హెచ్చరించాయి. తమిళ కూలీలెవ్వరూ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లొద్దంటూ సరిహద్దు వద్ద తమిళనాడు అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement