10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
చిన్నమండెం : 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలంలోని దేవగుడిపల్లె గ్రామం మాండవ్యనది నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రామాపురం మండలానికి చెందిన వీరనాగయ్య, సుబ్బయ్య, చలపతినాయుడు, రైల్వేకోడురుకు చెందిన బాబు, రవి, రామంజనేయులు అనే ఆరుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.