చిత్తూరు(అర్బన్): ఎర్రచందనం ఇతర రాష్ట్రాలను ఎగుమతే వ్యక్తులు, దుంగల లోడ్‌కు పెలైట్లుగా వెళ్లేవాళ్లు, చెట్లు నరికే కూలీలను సరఫరాచేసే మేస్త్రీలను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశా రు. అరెస్టయిన వారిలో ఏడుగురు నిం దితులు ఉన్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఓఎస్డీ రత్న, ఏఆర్ డీఎస్పీ దేవదాసులు విలేకరులకు వివరించారు. నేరస్తుల నేపథ్యం ఇదీ..
నారాయణ... ఐరాల మండలంలోని పుల్లూరుకు చెందిన నారాయణ (26) 2005 వరకు కారు మెకానిక్‌గా పనిచేసి ఆటో గ్యారేజీ పెట్టుకుని కొన్ని రోజుల జీవనం సాగించాడు. 2008 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ప్రారంభించాడు. కడపలోని రాయచోటి, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఎర్ర చందనం చెట్లను నరికించి బెంగళూరు, కటికనహళ్లి చెందిన ఇజాజ్, అసీఫ్, మజ్జూ, ముజీబ్‌లను సరఫరా చేసేవాడు. 10 మంది మేస్త్రీలను పెట్టుకుని 30 మంది కూలీల ద్వారా ఎర్రచందనం చెట్లను నరికించేవాడు. ఇతనిపై కడపలోని లక్కిరెడ్డిపల్లె, తిరుపతి రంగంపేట ఫారెస్టు రేంజ్‌లలో కేసులు కూడా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువ చేసే ఇల్లు,
వాహనాలు, స్థలాలు కొన్నాడు.
మస్తాన్ హుస్సేన్...: చిత్తూరు గిరింపేటకు చెందిన మస్తాన్‌హుస్సేన్ (24) నగరానికి చెందిన ఎర్రస్మగ్లర్ ఆయిల్ రమేష్ వాహనాలకు పెలైట్ డ్రైవర్‌గా వ్యవహరించేవాడు. ఇతన్ని ఆరు నెలల క్రితం భాకరాపేట అటవీశాఖ అధికారులు అరెస్టు కూడా చేశారు. ఇప్పటి వరకు పెలైట్‌గా పనిచేసి రూ.30 లక్షల వరకు సంపాదించాడు.
నాగరాజు.. చిత్తూరులోని మంగసముద్రంకు చెందిన రాజూరి నాగరాజు (22) తిరుపతి ఆటోనగర్‌లో స్థిరపడ్డాడు. ఎర్రచందనం వాహనాలు ఎటువైపు వెళ్లాలి, పోలీసులు ఎక్కడ గస్తీ కాస్తున్నారనే వివరాలను స్మగ్లర్లకు తెలియచేస్తూ పెలైట్‌గా వ్యవహరించేవాడు. ఇతను ఇప్పటి వరకు రూ.40 లక్షలు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సంపాదించాడు.
లోగు..: తమిళనాడులోని ఆంబూరుకు చెందిన లోగు అనే లోకనాథన్ ఎర్రచందనం చెట్లను నరకడానికి కూలీలను చిత్తూరు మీదుగా పంపించేవాడు. ఐరాలకు చెందిన నారాయణకు ఎర్ర కూలీల ను సరఫరాచేసేవాడు చెట్లను నరికిన తరువాత నారాయణ సరుకు చెప్పిన చోటుకు చేర్చేవాడు. ఇతను ఇప్పటి వరకు 20 లక్షలు సంపాదించాడు.
షేక్ షరీద్..: తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన షేక్‌షరీద్ (20) ఆర్టీసీలో అటెం డరుగా పనిచేసి మానేశాడు. తరువాత ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. 2013 నుంచి నారాయణకు పరిచయమై ‘ఎర్ర’దొంగల వాహనాలకు పెలైట్‌గా వ్యవహరించేవాడు. దుంగల్ని స్మగ్లర్లకు అప్పగించేవాడు. ఇప్పటి వరకు అక్రమంగా రూ.10 లక్షలు సంపాదించాడు.
అన్నాదొరై...: తమిళనాడులోని ఆంబూరుకు చెందిన అన్నాదొరై (36) కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఎర్రచందనం చెట్లను నరకడానికి కూలీగా వెళుతూ రెండేళ్లలో ఇతనే కూలీలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఎర్రచందనం ద్వారా సంపాదించాడు.
మురళి...: తిరుపతి కొర్లగుంటకు చెందిన ఏకపాటి మురళి (34) నారాయణ అనుచరుడు. చెట్లు కొట్టడానికి వచ్చే కూలీలకు బియ్యం, ముడిసరుకులు సరఫరా చేసేవాడు. ఇతనికున్న ఆటోలో ఎర్ర దుంగల్ని నారాయణ ఎక్కడ దింపమంటే అక్కడ దింపేవాడు. రెండు నెలల క్రితం ఇతన్ని తిరుపతి పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఎర్రచందనం అక్రమ తరలింపు ద్వారా రూ.10 లక్షలు సంపాదించాడు.
ఏడుగురు అంతర్రాష్ట్ర ‘ఎర్ర’ దొంగల అరెస్టు
Published Thu, Oct 9 2014 4:31 AM | Last Updated on Thu, Jul 11 2019 7:41 PM
Advertisement
Advertisement