అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం ఊస్సేనాపురం గ్రామ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. రిఫర్(సన్నటి చెక్కలు) లోడ్‌తో వెళ్తున్నలారీలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు.
చెన్నై నుంచి ముంబాయికి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందన్నారు. లారీ డ్రైవర్ సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(తాడిపత్రి)