పోలీసుల అదుపులో ఇద్దరు కూలీలు
తిరుపతి మంగళం/ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున వన్యప్రాణుల విభాగం అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు చోట్ల కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకొని, ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మామండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం డంప్‌ను గుర్తించినట్లు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్‌వో) చలపతిరావు తెలిపారు. ఈ సమయంలో అధికారుల రాకను గమనించి కొందరు కూలీలు పరారవ్వగా.. తమిళనాడులోని వేలూరుకు చెందిన రమేశ్ అనే కూలీని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ, తువ్ముచేనుపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భాకరాపేట ఘాట్‌లో కూంబింగ్ చేపట్టారు.
ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన సువూరు వంద మంది కూలీలు పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు యుత్నించారు. ఈ దాడిలో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ గాయుపడ్డాడు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
రూ.3.5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
Published Sun, May 1 2016 2:17 AM | Last Updated on Thu, Jul 11 2019 7:41 PM
Advertisement
Advertisement