ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న తమిళ కూలీలపై నిరంతర నిఘా కొనసాగుతోందని,ఈ విషయంలో పోలీసు శాఖ సహకారం మెరుగ్గా ఉందని ప్రొద్దుటూరు డివిజనల్ ఫారెస్టు అధికారి రవిశంకర్ పేర్కొన్నారు.
ముద్దనూరు: ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న తమిళ కూలీలపై నిరంతర నిఘా కొనసాగుతోందని,ఈ విషయంలో పోలీసు శాఖ సహకారం మెరుగ్గా ఉందని ప్రొద్దుటూరు డివిజనల్ ఫారెస్టు అధికారి రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అటవీశాఖ రేంజ్ కార్యాలయాన్ని డీఎఫ్‌వో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కొల్లగొడుతూ, అక్రమరవాణాలో పాత్రదారులైన తమిళ కూలీలను అరికట్టడానికి సుమారు 80మందికిపైగా సాయుధ పోలీసులు,అటవీశాఖ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉన్నారని, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే 14మంది తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్‌లో ఎర్రచందనం సంపద ఉన్న అటవీ ప్రాంతంలో తమ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ డివిజన్‌లో ప్రస్తుతం సమారు 1లక్షా20వేల ఎకరాల విస్తీర్ణంలో ఎర్రచందనం సంపద ఉందన్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమరవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ,సిబ్బంది పనితీరు,అభివృద్ధి పనుల ప్రగతిపై ఫారెస్టు రేంజ్ అధికారి రామ్మెహన్‌రెడ్డి,డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసులతో డీఎఫ్‌వో రవిశంకర్ సమీక్షించారు.