DFO
-
జింకల కొమ్ములు, చర్మం తరలిస్తున్న ముఠా అరెస్ట్
-
అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్ మండలం అబ్బాపూర్ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు గుల్ల చేయడంతో.. జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి -
ఏలూరు డీఎఫ్‌వోకు రెండు నెలల జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) యశోదాబాయికి కోర్టు ధిక్కార నేరం కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యశోదాబాయి అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. టెండర్ పిలిచి.. వర్క్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో.. పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజి పరిధిలో టేకు, కలప రవాణా నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ అటవీ శాఖ ఈ ఏడాది జనవరి 12న నోటిఫికేషన్ జారీ చేసింది. దాఖలైన టెండర్లలో ఏలూరుకు చెందిన గోలి శరత్‌రెడ్డి అనే వ్యక్తి లోయెస్ట్‌గా నిలిచారు. అధికారులు అతనికి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా.. వన సంరక్షణ సమితి ప్రతినిధులతో పనులు మొదలు పెట్టారు. దీనిపై శరత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ టెండర్ ప్రక్రియను పూర్తి చేసేంత వరకు ఎలాంటి పనులు కొనసాగించవద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని బేఖాతరు చేస్తూ పనులను కొనసాగిస్తున్నారంటూ జిల్లా అటవీ శాఖాధికారులు టి.శ్రీనివాసరావు, యశోదాబాయిలపై శరత్‌రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ టెండర్లను రద్దు చేయకుండానే వన సంరక్షణ సమితి చేత టేకు, కలప రవాణా పనులు చేయించడాన్ని తప్పు పట్టారు. వన సంరక్షణ సమితి చేత పనులు చేయించడం వెనుక సదుద్దేశమే ఉంటే, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే టెండర్లు రద్దు చేసి ఆ తరువాత పనులు కొనసాగించి ఉండేవారని తెలిపారు. కోర్టు ధిక్కారం నుంచి తప్పించుకునేందుకే యశోదాబాయి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన రోజునే టెండర్‌ను రద్దు చేశారని తెలిపారు. యశోదాబాయి చెబుతున్న మాటలు, బేషరతు క్షమాపణ వెనుక సదుద్దేశం లేదని, అందువల్ల ఆ క్షమాపణను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పేర్కొంటూ పై తీర్పునిచ్చారు. -
కంచే చేను మేసె!
సాక్షి, తిరుపతి: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. బోయకొండ సమీపంలోని అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన కేసులో డీఎఫ్ఓ, ముగ్గురు రేంజర్లు, ఒక సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసింది. ఈ సంఘటన మరువక ముందే.. అటవీశాఖలో పనిచేసే నలుగురు డీఆర్వోల నివాసాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో కుమ్మ క్కై కోట్లకు పడగలెత్తారని ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు వీరు సహకరించారనే అనుమానాలున్నాయి. అక్రమార్కుల నుంచి ముడుపులు జిల్లాలో శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం విస్తారంగా ఉన్న విషయం తెలిసిందే. చిత్తూరు అటవీ రేంజ్ పరిధిలో విలువైన మైనింగ్ లభ్యమవుతుంది. అటవీ సంపదను రక్షించేందుకు నియమించిన డీఎఫ్ఓ చక్రపాణి, మరో నలుగురు అటవీ అధికారులు మాధవరావు, మదన్‌మోహన్‌రెడ్డి, ఈశ్వరయ్య, రవిబాబు బోయకొండ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ రవాణాకు అనుమతులు ఇచ్చారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అటవీ సరిహద్దులనే మార్చివేసి అక్రమార్కుల నుంచి భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు విజిలెన్స్ విచారణలో బయటపడడంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటన మరువక ముందే మరో నలుగురు అటవీ అధికారుల నివాసాల్లో గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎర్రదొంగలతో కుమ్ముక్కు శేషాచలం అటవీ పరిధిలో నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా తరలిపోవడానికి కొందరు ఇంటి దొంగల సహకారం ఉందనే విషయం అధికార వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి. అటవీ, టాస్క్ ఫోర్స్‌లోని కొందరు అధికారుల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు లోడ్లు, ఆరు కోట్లుగా సాగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాలో భాగస్వామ్యులుగా ఉన్న కొందరు అధికారులు కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అందులో భాగంగా గురువారం ఏసీబీ అధికారులు అటవీశాఖలో పనిచేసే డీఆర్వోలు వెంకటాచలపతి నాయుడు, బాలకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, మాధవరావు నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా విడిపోయి నలుగురి నివాసాలతో పాటు బెంగుళూరు, చిత్తూరు, చంద్రగిరి, రాయచోటిలో ఉన్న వారి బంధువులు, స్నేహితుల నివాసాల్లో అర్థరాత్రి వరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెంకటాచలపతి నాయుడుకు రూ.5 కోట్లు విలువచేసే ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఆరు అంతస్తుల భవనం, అన్నారావు కూడలిలో ఐదు అంతస్తుల భవనం, గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలో షాపింగ్ కాంప్లెక్స్, శ్రీనివాసపురంలో గోదాము ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అదే విధంగా నగదు, బంగారు ఆభరణాలు, మరి కొన్ని డాకుమెంట్లను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. అటవీశాఖలో కలకలం ఏసీబీ దాడులతో అటవీశాఖలో కలకలం రేపుతోంది. అధికారులే స్మగ్లర్లకు సహకారం అందిస్తున్న విషయం వెలుగు చూడడంతో మరి కొందరు ఇంటి దొంగల్లో కలవరం మొదలైంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో సీఎఫ్ఓ గురువారం రాత్రి అటవీశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడులకు దారితీసిన కారణాలను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి: తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( డిఎఫ్ఓ) వెంకటా చలపతి నాయుడు అక్రమ ఆస్తులపై రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు సహచర ఉద్యోగులు వెంకటరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, మాధవరావు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటా చలపతి నాయుడు 20 కోట్ల రూపాయలు దాకా అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన నివాసంలో 14 జింక కొమ్ములను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో వెంకటా చలపతి నాయుడు నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం చంద్రగిరి మండలం ముంగిలిపట్టు, అత్తగారి గ్రామం నుండుపల్లిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. బెంగుళూరులో వెంకటా చలపతి నాయుడు బావమరిది నివాస గృహంలో కూడా మరో బృందం సోదాలు చేపట్టింది. టీకే వీధిలో వెంకటా చలపతి నాయుడుకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఆరు అంతస్తుల భవనం, అన్నారావు సర్కిల్లో 8 కోట్ల విలువైన ఆరు అంతస్తుల భవనం, గోవిందరాజా స్వామి నార్త్ మాడ వీధిలో షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు, బెంగుళూరు,చిత్తూరు, కడప జిల్లా రాయచోటిలలో పలు ఆస్తులను గుర్తించారు. మొత్తం ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట చలపతి నాయుడు అక్రమ ఆస్తుల బాగోతంపై అటవీశాఖలో విస్తృత చర్చ జరుగుతుంది. -
తిరుపతిలో ఏసీబీ దాడులు
-
అటవీ శాఖలో అవినీతి తిమింగలం
సాక్షి, తిరుపతి: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు.. లంచావతారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం వైఎస్ జగన్మోహర్రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుపతి అటవీశాఖ డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్( డిఎఫ్ఓ) వెంకటా చలపతి నాయుడు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్నారావు కూడలి సమీపంలో మోర్ సూపర్ మార్కెట్ వెనుక వైపు ఉన్న ఎం-2 గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్తు ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతితో పాటు ఏకకాలంలో కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగుళూరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ ఎం శ్రీనివాస్, డిఎస్పీ అల్లాబక్ష్, ఇన్స్పెక్టర్లు గిరిధర్, రవికుమార్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వెంకటా చలపతి నాయుడుకు చెందిన రూ.50 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. టీకే వీధిలో రూ.10 కోట్లు విలువైన ఆరు అంతస్తుల భవనం, అన్నారావు సర్కిల్లో 8 కోట్ల విలువైన ఆరు అంతస్తుల భవనం, గోవిందరాజా స్వామి నార్త్ మాడ వీధిలో షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు, బెంగుళూరు,చిత్తూరు, కడప జిల్లా రాయచోటిలలో పలు ఆస్తులను గుర్తించారు. మొత్తం ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
అబ్బురపరుస్తున్న అరుదైన జంతువులు.!
అద్భుతమైన వృక్ష సంపద.. అరుదైన జంతువులకు మన అడవులు కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని నల్లమల, శేషాచలం, లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో సుమారు 1000కి పైగా వివిధ రకాల జంతు జాతులు నివసిస్తున్నాయి. అధికారులు కూడా వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. దేశంలో గుర్తింపు పొందిన పాంగోలిన్ (ఆలువ), హానిబడ్గర్ లాంటి అరుదైన జంతువులు కూడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాలకు ఇటీవల దొరికాయి. సాక్షి కడప : ప్రపంచంలోనే అరుదైన అటవీ ప్రాంతం కడప సొంతం. ఎక్కడా లభించని ఎర్రచందనం కూ డా మన అడవుల్లోనే దొరుకుతుంది. ఇంతటి ప్రత్యేకత గల జిల్లా అడవు ల్లో పెద్ద పులులతోపాటు చిరుతలు, ఇతర అరుదైన జంతువులు కూడా కనిపిస్తున్నాయి. వీటితోపాటు పాంగోలిన్, హానీబడ్గర్ లాంటి జంతువులు కెమెరాకు చిక్కాయి. జిల్లాలో ఫారెస్టుకు సంబంధించి మూడు డివిజన్లు ఉండగా.. సుమారు 50కి పైగా కెమెరాలను అమర్చారు. అడవిలోని చెట్లకు, ఇతర నీటి కొలనులు ఉన్న ప్రాంతాల్లో వీటినిబిగించారు. అడవి జంతువులు అటువైపుగా వచ్చినపుడు కెమెరాల్లో దొరుకుతున్నాయి. అడవిలో పిల్లలతో ఎలుగుబంటి 1000 రకాలకు పైగా జంతువులు జిల్లాలో సుమారు 4.31 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఇందులో అనేక రకాలైనటువంటి జంతువులు నివసిస్తున్నాయి. పులి, చిరుతలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, కొండగొర్రెలు, రొచ్చు కుక్కలు, నక్కలు, తోడేలు, అడవి దున్నలు, కుందేళ్లు, నెమళ్లు, కంతులు లాంటి జంతువులు నిత్యం అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. సుమారు 1000రకాలకు పైగా జంతువులు నివసిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జంతువుల గణనలో భాగంగా జిల్లాలో 2018 జనవరి 22వ తేదీనుంచి 28వ తేదీవరకు చేపట్టారు. అధికారులు అడవినంతా కలియతిరిగి లెక్కలు కట్టగా వేలాది రకాల జంతవులు ఉన్నట్లు గుర్తించారు. అరుదైన జంతువులకు మన అడవులు వేదిక అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి కొలను వద్ద రొచ్చు కుక్కలు వన్య ప్రాణులను వేటాడొద్దు – డీఎఫ్ఓ జాతీయ సంపదగా భావించే అడవులు, అక్కడ నివసించే జంతువులను కాపాడుకోవాలని..అలా కాకుండా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని కడప డీఎఫ్ఓ శివప్రసాద్ హెచ్చరించారు. అడవి జంతువులు, జింకలు, ఇతర వన్యప్రాణులు రైతుల పొలాల్లోకి వచ్చి నష్టపరుస్తున్నాయని...కరెంటు, ఇతర ఆయుధాల ద్వారా చంపడం నేరమన్నారు. ఎక్కడైనా రైతులకు జంతువుల ద్వారా నష్టం జరిగినట్లు తమ సిబ్బంది దృష్టికి తీసుకు వస్తే పొలాన్ని పరిశీలించి వ్యవసాయాధికారుల ద్వారా పంట నష్టానికి సంబంధించిన పరిహారం వచ్చేలా కృషి చేస్తామని వివరించారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని....వన్య ప్రాణులను స్వేచ్ఛగా అడవిలో సంచరించేలా సహకరించాలే తప్ప ప్రాణహాని కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విస్తుగొలిపే మోహనరావు వికృతాలు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫారెస్ట్ అధికారి మోహనరావు వికృత చేష్టలపై డొంక కదులుతోంది. పోలీసుల విచారణలో పలువురు బాధిత మహిళలు ఆయన అకృత్యాలను ధైర్యంగా బయటపెడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగాల పేరుతో యువతుల నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వికృత చేష్టలకు పాల్పడుతున్న కె.మోహనరావుపై మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగం పేరుతో రూ.2 లక్షలు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవారని చీరాలకు చెందిన యువతి బుధవారం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడికొండూరు సీఐ ఎం.ఆనందరావు, సిబ్బంది పేరేచర్లలోని ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు అయితే ఫారెస్ట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువతిని కూడా బలవంతంగా లొంగదీసుకుని సెలవు రోజుల్లో ఆమెపై వికృత చేష్టలకు పాల్పడినట్టు పోలీసుల ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైందని తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం వెళితే రూ.4 లక్షలు తీసుకుని ఆమెను కూడా ఇదే తరహాలో భయపెట్టి లోబరచుకున్నాడు. తన డబ్బు ఇవ్వకుంటే నడిరోడ్డుపై కూర్చుంటానని ఆ యువతి హెచ్చరించడంతో విడతలవారీగా రూ.3.50 లక్షలు తిరిగి ఇచ్చాడని ఆమె చెప్పినట్టు సమాచారం. మాచర్లకు చెందిన ఓ రిక్షా కార్మికుడి కుమార్తెను కూడా ఇదే తరహాలో లోబరుచుకునేందుకు యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అనంతరం మోహనరావు ఆ రిక్షా కార్మికుడిని బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశాడని తెలిసింది. అయితే ఈ విషయం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టిలో ఉండటంతో ఆయన కూడా ఈ విషయాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. డీఎఫ్ఓను బదిలీ చేయండి సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు డీఎఫ్ఓను మోహనరావును తక్షణమే బదిలీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మోహన్‌రావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో ఆయనను తక్షణమే బదిలీ చేసి, విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ దళాల అధిపతి రిజ్వీని మంత్రి ఆదేశించారు. -
జాబ్ పేరుతో వికృత చేష్టలు, డీఎఫ్‌వోపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా అటవీశాఖాధికారి డీఎఫ్‌వో మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆరోపణలపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులను విద్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నివేదిక రాగానే డీఎఫ్‌వోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు. కాగా అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్‌రావు ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదని చెప్పడంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని సదరు అధికారిని బదిలీ చేయాలంటూ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు -
వన్యప్రాణుల గణన
ఖానాపురం(నర్సంపేట): అడవులతోపా టు వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి అటవీ జంతువుల గణన చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అటవీ ప్రాంతాలపై పట్టున్న అధికారులు, స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు రంగంలోకి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉం ది. మొత్తం 16 బీట్లు ఉండగా తొమ్మిది బీట్ల పరి« దిలోనే అడవులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల వివరాలు సేకరించడానికి ఫారెస్ట్ అధికారులతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులను కలుపుకుని తొమ్మిది బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇందులో ఎఫ్ఆర్వో, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు వలంటీర్లుగా పాల్గొంటారు. ఈ బృందాలు శాఖాహార, మాంసాహార జంతువుల గణన, అవి నివసించే స్థలాల గుర్తింపు కార్యక్రమాన్ని రెండు విడతలుగా ఈనెల 29 వరకు చేపట్టనున్నారు. అలాగే వృక్ష జాతులు, మానవులు సంచరిస్తున్న ప్రాంతాల వివరాలు సైతం సేకరించనున్నట్లు ఫారెస్ట్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రత్యేక యాప్ వినియోగం అటవీ జంతుల గణన కోసం ప్రత్యేక విధానాన్ని వినియోగించనున్నారు. ముఖ్యంగా పులుల గుర్తింపునకు ఎంస్ట్రైప్స్(మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్–ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అండ్ ఎకోలాజికల్ స్టాటస్) యాప్‌ను ఉపయోగించనున్నారు. దీని ద్వారా పులుల సంఖ్య కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పులుల కాలి అడుగుల ఆనవాళ్లు, వాటి మూత్ర విసర్ణ అవశేషాలు, వెంట్రుకల ఆధారంగా గుర్తించనున్నట్లు సమాచారం. పులుల సంఖ్య తెలుసుకోవడానికి తొమ్మిది బీట్ల పరిధిలో మూడు సీసీ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. తొలి మూడు రోజుల్లో మాంసాహార జంతువులు, ఆ తర్వాత మూడు రోజులు శాఖాహార జంతుల వివరాలు సేకరించనున్నారు. 22, 23, 24 తేదీ ల్లో క్రూర మృగాలు, మాంసాహార జంతువుల పై, 27, 28, 29 తేదీల్లో శాఖాహార జంతువులు, వాటి నివాసాలు, వృక్ష జాతుల గణన చేపడతారు. ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రభుత్వ ఆదేశానుసారంగా సోమవారం నుంచి వన్యప్రాణుల గణన చేపట్టనున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. గణన రెండు దఫాలుగా సాగుతుంది. ఇందులో ఫారెస్ట్ సిబ్బందితోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు పాల్గొంటారు. ఆరు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ చేపట్టి వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరుస్తాం. – పురుషోత్తం, డీఎఫ్ఓ -
తమిళ కూలీల కదలికలపై నిరంతరం నిఘా
ముద్దనూరు: ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న తమిళ కూలీలపై నిరంతర నిఘా కొనసాగుతోందని,ఈ విషయంలో పోలీసు శాఖ సహకారం మెరుగ్గా ఉందని ప్రొద్దుటూరు డివిజనల్ ఫారెస్టు అధికారి రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అటవీశాఖ రేంజ్ కార్యాలయాన్ని డీఎఫ్‌వో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కొల్లగొడుతూ, అక్రమరవాణాలో పాత్రదారులైన తమిళ కూలీలను అరికట్టడానికి సుమారు 80మందికిపైగా సాయుధ పోలీసులు,అటవీశాఖ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉన్నారని, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే 14మంది తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్లో ఎర్రచందనం సంపద ఉన్న అటవీ ప్రాంతంలో తమ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ డివిజన్లో ప్రస్తుతం సమారు 1లక్షా20వేల ఎకరాల విస్తీర్ణంలో ఎర్రచందనం సంపద ఉందన్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమరవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ,సిబ్బంది పనితీరు,అభివృద్ధి పనుల ప్రగతిపై ఫారెస్టు రేంజ్ అధికారి రామ్మెహన్‌రెడ్డి,డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసులతో డీఎఫ్‌వో రవిశంకర్ సమీక్షించారు. -
మొక్కల పెంపకం సామాజిక బాధ్యత
జిల్లా అటవీ అధికారి అప్పన్న ధవళేశ్వరం : మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి అప్పన్న పిలుపునిచ్చారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన వనం–మనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కలను పరిరక్షిస్తామని తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం విస్తీర్ణంలో మొక్కలు ఉన్నాయన్నారు. దీనిని 2029 నాటికి 50 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా తమ శాఖ ప్రతి శనివారం పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎఫ్ఆర్ఓ టి.శ్రీనివాసరావు, కాకినాడ ఎఫ్ఆర్ఓ జి.మురళీకృష్ణ, అనపర్తి ఎఫ్ఎస్ఓ ఎస్.వెంకట రమణ, కళాశాల పీడీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ డీఎఫ్ఓ ఆఫీసే జిల్లా కార్యాలయం
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి సబ్ డీఎఫ్ఓ కార్యాలయాన్నే డీఎఫ్ఓ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధికారులు ఆ భవనాన్ని పరిశీలించి ప్రక్రియ ప్రారంభించారు. అధికారుల బాధ్యతల్లో పలుమార్పులు జరగనున్నాయి. కొన్ని మండలాలు డీఎఫ్ఓ పరిధిలో చేరనున్నాయి. అటవీశాఖ మానుకోట సబ్‌డివిజన్ పరిధిలో గూడూరు, నెక్కొండ, చెన్నారావుపేటలోని కొన్ని గ్రామాలు మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, నర్సింహులపేట, కురవి, కొత్తగూడలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఎఫ్ఆర్ఓ పరిధిలో పది మండలాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నూతన డీఎఫ్ఓ పరిధిలో నాలుగు రేంజ్‌లు మానుకోట డీఎఫ్ఓ పరిధిలోకి నాలుగు రేంజ్‌లు రానున్నాయి. మానుకోట రేంజ్‌తోపాటు బయ్యారం, గూడూరు, కొత్తగూడ రేంజ్‌లు ఉంటాయి. గూడూరు మండలంలోని కొంగరగిద్ద గ్రామం వైల్డ్‌లైఫ్ విభాగంలోకి వెళ్తుంది. నెక్కొండ మండలం వరంగల్ జిల్లాలోకి వెళ్లినా గూడూరు రేంజ్ పరి«ధిలోనే ఉంటుంది. సోషల్ ఫారెస్ట్ ప్రత్యేక విభాగం టెరిటోరియల్ విభాగంలోకి చేర్చుతున్నారు. సబ్ డీఎఫ్ఓలోనే ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫీసర్)గా మారుస్తున్నారు. కొన్ని నోడల్ అధికారుల మార్పు కూడా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని మార్పులు మాత్రం ప్రత్యేకంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ఏనుగుల దాడుల నివారణకు పటిష్ట చర్యలు
– 95 శాతం రక్షణ చర్యలు పూర్తి – నష్టపరిహారం త్వరలో అందిస్తాం – డీఎఫ్‌వో చక్రపాణి చిత్తూరు(కార్పొరేషన్) : కుప్పం, రామకుప్పం ప్రాంతాల్లో ఏనుగుల దాడులు అధికంగా ఉన్నాయనీ, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్ డీఎఫ్‌వో చక్రపాణి తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచ్ 201 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 118 ఆర్సీసీ పిల్లరు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో 58 నిర్మాణం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 60 నిర్మాణ దశలో ఉన్నట్టు చెప్పారు. అక్టోబరులో వాటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. గజరాజుల దాడుల్లో వందలాది ఏకరాలు పంట నష్టపోయిన రైతులకు రూ.14 లక్షలు పరిహార నివేదిక కలెక్టర్‌కు పంపించామన్నారు. ఆయన అనుమతి జారీచేస్తే బాధితులకు పరిహారం అందజేస్తామన్నారు. ఈ వర్షాకాల సీజన్లో మొత్తం 320 హెక్టార్లలో ఆరు లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ 77 వాహనాల అంచనా విలువ రవాణా అధికారులు వేసిన వెంటనే బహిరంగ వేలం నిర్వహించి విక్రయిస్తామని తెలిపారు. -
'తిరుమలలో చిరుతలను బంధించలేం'
తిరుమల : తిరుమలలో సంచరిస్తున్న చిరుతలను బంధించలేమని డీఎఫ్‌వో శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు. శుక్రవారం తిరుమలలో డీఎఫ్‌వో శివరాంప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... కొన్ని రోజులపాటు భక్తులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగవద్దు అని ఆయన భక్తులకు సూచించారు. తిరుమలలో మూడు చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. -
తాగు నీరు లేక చిరుత పులి మృతి
ఎండల తీవ్రత పెరిగి.. తాగు నీరు అందని పరిస్థితుల్లో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కోటకొండ అటవీ ప్రాంతంలో ఇలానే ఓ చిరుత పులి మృతి చెందింది. స్థానికులు బుధవారం ఉదయం చూసి అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. డీఎఫ్‌వో శివప్రసాద్ సిబ్బందితో కలసి చనిపోయిన చిరుత పులిని పరిశీలించారు. తాగు నీరు లభించక మూడు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రూ.కోటి విలువ గల ఎర్రచందనం స్వాధీనం
కడప అర్బన్: అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ, కడప ఇన్చార్జి డీఎఫ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ ఎస్ఎం హయాత్, రాయచోటి ఎఫ్ఆర్ఓ శ్రీరాములు తమ సిబ్బందితో కడప-రాజంపేట రహదారిలోని భాకరాపేట సమీపంలోగల హెచ్‌పీసీఎల్ వద్ద లారీతోసహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనాన్ని తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భాకరాపేటకు చెందిన తుర్రా వెంకట సుబ్బయ్య, తుర్రా ప్రతాప్, తుర్రా శ్రీనివాసులు, తుర్రా ప్రభాకర్‌లు తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నామని డీఎఫ్ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో మూడు టన్నుల బరువున్న 94 ఎర్రచందనం దుంగలను, 10 టైర్ల లారీ (ఏపీ16 టీయూ 2722)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పరారయ్యారన్నారు. ఎర్రచందనం దుంగల విలువ కోటి రూపాయలు, లారీ రూ.8 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఎఫ్ఆర్ఓలు హయాత్, శ్రీరాములు, ఎఫ్‌ఎస్‌ఓలు ఓబులేసు, చెండ్రాయుడు, ఎంబీఓలు శ్రీనివాసులు, సురేష్, కృష్ణ, ప్రొటెక్షన్ వాచర్లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అభినందించారు. 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం బద్వేలు అర్బన్: అక్రమంగా తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ఇండికా వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బద్వేలు సీఐ వెంకటప్ప తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ21 ఏఆర్ 3978 నంబరుగల ఇండికా కారు అనుమానాస్పదంగా ఉండడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 8 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కారులో ఉన్న అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన పఠాన్ బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబు, సింహాద్రిపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన రాంబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి బెంగళూరుకు చెందిన పేరుమోసిన స్మగ్లర్ అక్రమ్ అనుచరుడు తంబుకు దుంగలు చేరవేస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ నాగమురళి, ఎస్బి ఎస్ఐ రామాంజనేయులు, ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నాగార్జున, శేఖర్‌బాబు, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
డీఎఫ్ఓ వాహనంపై ఏసీబీ దాడి
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఉద్యోగోన్నతి కోసం లంచం ఇచ్చేందుకు జిల్లా అటవీశాఖాధికారి నూకవరపు నాగేశ్వరరావు నగదుతో గుంటూరుకు వెళుతున్నాడన్న సమాచారంతో దగదర్తి మండలంలోని సున్నపుబట్టీ టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం అతని వాహనంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాహనంలో ఉన్న రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఏసీబీ సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో సున్నపుబట్టీ వద్ద కాపు కాశారు. నెల్లూరు డీఎఫ్ఓ నాగేశ్వరరావు బొలేరో వాహనంలో గుంటూరుకు వెళుతుంగా ఆపి తనిఖీలు నిర్వహించారు. వాహనంలో రూ.11.50 లక్షల నగదు లభిచింది. నగదుకు సంబంధించి వివరాలను అడిగితే డీఎఫ్ఓ పొంతన లేని సమాధానాలు చెప్పారు. నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు గుంటూరులోని అతని స్నేహితుడికి ఇవ్వాలని ఇచ్చాడని, అత్యవసర పని నిమిత్తం బ్యాంకులో దాచి ఉంచిన డబ్బులు తీసుకుని గుంటూరు వెళుతున్నానని, అది తన డబ్బులేనని ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎఫ్ఓని అదుపులోకి తీసుకుని నెల్లూరు అటవీశాఖ కార్యాలయంలోని ఆయన క్వార్టర్స్‌కు తరలించారు. అతను నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలను, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్లు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు, విలువైన ఫోన్లు ఎప్పుడు? ఎక్కడ కొనుగోలు చేశారు? వాటికి సంబంధించిన బిల్లులు తదితరాలను పరిశీలించారు. అనంతరం అతని కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యాలయ సిబ్బందిని సైతం విచారించారు. ఏసీబీ సోదాలతో అటవీశాఖ అధికారుల్లో వణుకు పుట్టించాయి. ఏసీబీ అధికారులు కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో పలువురు సిబ్బంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డీఎఫ్ఓను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. డీఎఫ్‌ఓపై ఫిర్యాదు నేపథ్యంలోనే డీఎఫ్ఓ నాగేశ్వరరావుపై ఏసీబీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందినట్లు సమాచారం. నాగేశ్వరరావు జిల్లా అటవీఅధికారిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. నాగేశ్వరరావు తన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని కాంట్రాక్టర్ల నుంచి రూ.లక్షల్లో నగదు లంచాలు తీసుకున్నాడని, ఎర్రచందనం పెద్దఎత్తున అక్రమంగా రవాణా జరుగుతున్నా నియంత్రించలేకపోయారని, దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు చేతులు మారాయన్న ఆరోపణలు చేసినట్లు తెలిసింది. దీంతో డీఎఫ్‌ఓపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. సోమవారం గుంటూరులో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశం ఉంది. ఈ సమావేశానికి డీఎఫ్ఓ హాజరు కావాల్సి ఉంది. పనిలో పనిగా తన ప్రయోషన్ కోసం ముడుపులు ముట్టచెప్పేందుకు డీఎఫ్ఓ వెళుతున్నాడని సమాచారం అందడంతో ఏసీబీ డీఎస్పీ జె. భాస్కర్‌రావు తన సిబ్బందితో కలిసి టోల్‌ప్లాజా వద్ద బొలేరో వాహనంలో తనిఖీలు చేశారు. ఏసీబీ అదుపులో మధ్యవర్తి డీఎఫ్‌ఓకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సదరు ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనను తమ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సదరు ఉద్యోగి కాంట్రాక్టర్ల నుంచి డీఎఫ్ఓ పేరు చెప్పి పెద్ద ఎత్తున లంచాలు గుంజాడన్న ఆరోపణలు ఉండటంతో కాంట్రాక్టర్లను సైతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారానికి పూర్తిస్థాయిలో విచారణ జరిపి డీఎఫ్ఓను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేను ఏం నేరం చేయలేదు తాను ఏం నేరం చేయలేదని డీఎఫ్ఓ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధుల ఎదుట వాపోయాడు. తన స్నేహితుడు గుంటూరులో ఉన్న మరో స్నేహితుడికి డబ్బులు ఇవ్వాలని ఆ నగదు ఇచ్చాడన్నారు. నగదుకు సంబంధించి లెక్కలు ఉన్నాయని, కోర్టులోనే నిజాయితీని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. లెక్కలు లేవు : జె. భాస్కర్‌రావు, ఏసీబీ డీఎస్పీ డీఎఫ్ఓ వద్ద దొరికిన నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కలు లేవు. ఆయన ఆ నగదుకు సంబంధించి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. నగదు ఎవరిది? ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడికి తీసుకెళుతున్నారు అనే విషయాలను విచారిస్తున్నాం. డీఎఫ్ఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తాం. రెండేళ్లుగా అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఏసీబీ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలోనే తొలిబోణి చేశారు. -
ఏసిబి వలలో చిక్కిన ఉత్తమ అధికారి
-
విశాఖ వుడా డీఎఫ్‌వో నివాసంపై ఏసీబీ దాడులు
విశాఖ : విశాఖ నగర పాలక సంస్థలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఎఫ్‌వో రామ్మోహన్ రావు నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేశారు. ఆయన నివాసంతో పాటు విజయనగరం జిల్లా సాలూరులోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.