బైకులపై స్మగ్లింగ్ : నలుగురి అరెస్ట్ | red sandle wood smugglers arrested in kadapa distirict | Sakshi
Sakshi News home page

బైకులపై స్మగ్లింగ్ : నలుగురి అరెస్ట్

Published Wed, Jan 28 2015 12:49 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

red sandle wood smugglers arrested in kadapa distirict

బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లాలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఎర్రచందనం దుంగలను చిన్న చిన్న ముక్కలుగా కోసి  అనుమానం రాకుండా వాటిని లగేజీ బ్యాగుల్లో పెట్టుకుని బైకులపై వెళుతూ మైదుకూరు వద్ద తనిఖీల్లో దొరికిపోయారు. రెండు బైకులపై వెళుతున్న షేక్ ఖాజారసూల్, గొడ్లవీటి వెంకటేశ్వర్లు, ఇమ్మిడిశెట్టి పెంచలయ్య, జి.చెన్నారెడ్డిలను గోపవరం రూరల్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు.

వారి నుంచి ఎర్రచందనాన్ని, బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారు నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement