అభయారణ్యమే రక్తచందనానికి రక్ష
అంతరించిపోతున్న పక్షి, జంతుజాతుల పరిరక్షణ, వృద్ధికృషిలో అభయారణ్యాల వల్ల మంచి ఫలితాలు లభించాయి. అలాగే ఎర్రచందన ప్రాంతాలను కూడా అభయార ణ్యంగా గుర్తించి, ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
రక్తచందనం! దక్షిణ భార తంలోని తూర్పు కనుమలకే పరిమితమైన అరుదైన ఈ కలప కోసం రక్తం చిందుతోం ది. ఎర్ర బంగారంగా పేరు మోసిన అపురూప సంపద అంతర్జాతీయ స్మగ్లర్ల గొడ్డలి వేటుకు బలైపోతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులకే నేడు పరిమితమైన ఎర్రచందనం ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొం ది. ఎర్రచందనం ప్రధానంగా చిత్తూరు, కడప, కర్నూ లు, నెల్లూరు జిల్లాల్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా దొరకని ఈ కలపను పూర్వీకులు రోకళ్లుగా ఉపయోగిం చేవారు! దశాబ్దంనర క్రితం నేను కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తుండగా వంట చెరకుగా, గుడిసెల గుంజలుగా, బొమ్మల తయారీకి ఆ కలపను వాడటం చూశాను. అపు రూపమైన ఈ కలపను ఇలా వాడటమేమిటని ప్రశ్నిస్తే ప్రజలు విస్తుపోవడమూ గమనించాను. ఆ నాలుగు జిల్లాల్లో దాన్ని రక్త చందనం అంటారనీ అప్పుడే తెలి సింది. పాత కాలపు ఫర్నిచర్‌గా దర్శననిచ్చే ఎర్రచంద నానికి పెనుముప్పు రానున్నదని గానీ, ప్రపంచంలో మరే కలపకు లేని ధర దానికి పలుకుతుందని గానీ ఊహించలేకపోయాను. స్మగ్లర్ల నుంచి దాన్ని రక్షించడా నికి అధికారులు రక్తం చిందించాల్సి వస్తుందని అసలే అనుకోలేదు.
ఈ మధ్య ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం దుంగలను వేలం వేస్తే మొదటి శ్రేణి కలపకు కిలో పదిహేను వేల రూపాయల ధర పలికింది. దాదాపు వెండి ధరలో సగం! ఇంత విలువ కాబట్టే ప్రభుత్వం దాని ఎగుమ తులను నిషేధించినా స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు ప్రాణా లు తియ్యడానికి, ఇవ్వడానికి వెనుకాడక అక్రమ రవా ణాకు పాల్పడుతున్నారు. అసలు ఈ కలపకు విదేశాల్లో అంత విలువ ఎందుకుంటుందో అంతుబట్టడం లేదు. చైనాలో సంగీత వాద్యాల, వాస్తు సంబంధ వస్తువుల తయారీలో వాడుతారని మాత్రం వింటున్నాం. అత్యంత ఖరీదైన ‘వయాగ్రా’ వంటి ఔషధాల తయారీలో వాడు తున్నారని కొందరు అంటున్నారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు స్మగ్లర్ల దుష్ట రాక్షస క్రీడ పట్ల ఉపేక్ష వహిం చడం వల్లనే ఎర్రచందనం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పటికే ఎంతో అటవీ సంపదను, ప్రభుత్వ రాబడిని నష్టపోయాం. అంతరించిపోతున్న పక్షి, జంతు జాతుల పరిరక్షణ, వృద్ధిలో అభయార ణ్యాల వల్ల మంచి ఫలితాలు లభించాయి. అలాగే ఎర్ర చందన ప్రాంతాలను కూడా అభయారణ్యంగా గుర్తించి, ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
ఏం చెయ్యాలి?
1920లలో సర్ కేసిన్ అనే బ్రిటిష్ అటవీ అధికారి ఎర్ర చందనం అడవుల పరిరక్షణకు ఒంటరిగా చేసిన కృషి మనకు ప్రేరణ కావాలి. వర్షం కురిసిన ప్రతిరోజూ ఆయన సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్తూ కోటు జేబుల నిండా ఎర్రచందనం విత్తనాలను నింపుకొని, చేతికర్ర వాడి మొనతో తడిచిన నేలలో రంధ్రాలు చేస్తూ ఒక్కొక్క విత్తే వేసి బూటు కాలుతో మట్టి కప్పేవారు. ఏళ్ల తరబడి ఆ ఒక్కడు చేసిన కృషి ఫలితం చిత్తూరు నడిబొడ్డున సగ ర్వంగా నిలిచి ఉన్న 156 హెక్టార్ల వనం. రచయిత ఈ వ్యాసం రాసినది ఆ రక్తచందనం చెట్ల నీడన సేద తీరుతూనే!
ఈ వృక్ష సంపద పరిరక్షణ ఆవశ్యకతపైనా, అం దుకోసం ఇప్పటికే ఉన్న చట్టాలపైనా ప్రజలకు అవ గాహన కల్పించాలి. అటవీ, పోలీసు సిబ్బందితో సమన్వయం ఉండేలా గ్రామగ్రామానా యువతతో నిఘా విభాగాల్ని ఏర్పాటు చేయాలి. విదేశాల్లో ఈ కలపను ఎందుకు ఉపయోగిస్తున్నారనే రహస్యాన్ని కని పెట్టి, ఆ అంతిమ వస్తువును మనమే తయారు చేసి ఎగుమతి చేయవచ్చు. తద్వారా దొంగ రవాణాను అరి కట్టడంతో పాటూ ప్రభుత్వ రాబడిని, విదేశీ మారక ద్రవ్య ఆర్జనను పెంచుకోవచ్చు. అడవుల్లోని వృక్షా లను ప్రభుత్వమే వయసు, వన్నె, చేవ ఆధారంగా గుర్తిం చి, నరికించి, తగురీతిన ఉపయోగించాలి. విలువైన వృక్షాలు వయసుమీరి ఎండిపోయి, చెదపట్టి వ్యర్థమైపో తున్నాయనే విమర్శా ఉంది. తమిళనాడులోని కృష్ణ గిరి, తిరువణ్ణామలై, సేలం, ధర్మపురి జిల్లాలే ఎర్ర చందనం నరికే కూలీలకు నెలవులు. ఒక్కో చెట్టుకు కూలిగా కొన్ని వేలు లభిస్తాయన్న ఆశతోనే వాళ్లు ఎంత కన్నా తెగిస్తున్నారు. స్వచ్ఛందసంస్థల సహాయంతో కలిసి ఆ ప్రాంతాల్లోని అక్రమ కూలీలలో పరివర్తనకు కృషి చేయాలి. తెగింపు కలిగిన కూలీలు లేనిదే స్మగ్లర్ల ఆటలు సాగవు. అటవీశాఖను సమూలంగా ప్రక్షా ళనచేసి నిజాయితీ, నిబద్ధత, సమర్థతలకు మారు పేరుగా తీర్చిదిద్దాలి. నాలుగు జిల్లాల్లోని దట్టమైన విలు వైన ఎర్రచందనం అడవుల రక్షణకుగానూ ప్రతి 20 చద రపు కిలోమీటర్లకు ఒక బీట్ ఆఫీసర్‌ను, అసిస్టెంటును నియమించాలి. అంతిమంగా అడవి రక్షణ బాధ్యత ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లదే కాబట్టి రాజకీయ జోక్యం పట్ల వారిలో ఉన్న ఆందోళనలను తొలిగించి, ధైర్యాన్ని కలి గించి, ఉత్తేజితులను చేయాలి. సిబ్బందికి మంచి ఆయు ధాలను, ప్రత్యేక అధికారాలను సమకూర్చాలి. అవ సరమైన చోట్ల పటిష్టమైన కంచె నిర్మాణం చేపట్టాలి. స్మగ్లర్లకు కఠినశిక్షలు పడేలా చేయడమేగాక, వారికి రాజ కీయ అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణే రాకుం డా నేతలు జాగ్రత్త వహించాలి. పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులు స్థానిక సంస్థలతో కలిసి పనిచే యాలి. ఈ అందరి భాగస్వామ్యమే ఎర్ర చందనం అడ వులకు రక్ష. ఎర్ర చందనం నర్సరీలను విస్తరింపజే యడంతో పాటూ, వాటిని పెంచుకుంటామనే రైతులకు మొక్కల్ని ఇచ్చి ప్రోత్సహించాలి.
సందర్భం: డా॥కృష్ణ చంద్రమౌళి, (వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి)