![Forest Guard 2 0 Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/forest-guard-2.0-details.jpg.webp?itok=wjxyE8O1)
ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న బాక్స్, అడవుల్లో సంభవించే పెద్ద అగ్నిప్రమాదాలను అరికట్టగలదు. ‘ఫారెస్ట్ గార్డ్ 2.0’ పేరుతో సూట్ బతుహాన్ ఎసిర్గర్, రానా ఇమాన్ అనే ఇద్దరు యువకులు ఈ చిన్న ఫైర్ సెన్సర్ డివైజ్‌ను రూపొందించారు.
ఇది ఐఓటీ బేస్డ్ శాటిలైట్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది క్షణాల్లోనే మంటలను గుర్తించి, సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేస్తుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వెంటనే గుర్తించి, మంటలను నివారించి, అడవులను రక్షిస్తుంది.
ఈ సెన్సార్‌ను ఏదైనా చెట్టుకు తగిలిస్తే చాలు, దాదాపు పదహారు హెక్టార్ల దూరం వరకు ఉండే మంటలను గుర్తిస్తుంది. ‘అడవుల్లో సంభవించే ప్రమాదాలను వెంటనే అరికట్టకుంటే పెద్ద నష్టమే వస్తుంది. అందుకే, మేము ఈ ఆలోచన చేశాం’ అని ఆ ఇద్దరూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment