హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మారిషస్లో అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. గంగిరెడ్డిపై కడప, కర్నూలు జిల్లాలలో పలు కేసులు ఉన్నాయనీ, వీటిపై సమగ్రంగా విచారణ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే గంగిరెడ్డి మాత్రం నేనెక్కడికీ పారిపోలేదు, వ్యాపార పనుల కోసం మారిషస్ వెళ్లాను, నా టైం బాగోలేదు కాబట్టే ఇలా జరిగింది అంటున్నాడు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం సరికాదని తనకు ఎవరి నుండి ప్రాణహాని లేదని గంగిరెడ్డి తెలిపాడు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్లో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆయన్ని ఇండియాకు రప్పించడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్నారు.